Search This Blog

Abdul Kalaam to act in a Hindi film


ముంబై: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన మై కలామ్ హూ అనే సినిమాలో నటిస్తున్నారు.కలామ్ ఎరోనాటికల్ ఇంజినీర్. అంతరిక్ష రాకెట్ టెక్నాలజీలో ఆయనకు ఎనలేని పేరు వచ్చింది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు సంపాదించుకున్నారు.

పిల్లలతో కలామ్ ఈ సినిమా చేశారు. ఈ సినిమాకు మాధవ్ పాండేయ దర్శకత్వం వహించారు. స్మైల్ ఫౌండేషన్ ఈ సినిమాను నిర్మించింది. పిల్లలంటే ఎనలేని మక్కువ చూపే కలామ్ పిల్లలతో సినిమా చేయడానికి అంగీకరించారు. సినిమా కూడా కలాం దార్శనికతకు దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాను కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగే చలనచిత్రోత్సవాలకు పంపుతారు.

0 Responses

Post a Comment

Commenttttt

  • My Stuff

    Followers